Updated: Sep 13

అతనిలో లోపాలు చూసిన సృష్టికర్త, ఒక మాటతో తన అసంపూర్తిని తొలగించింది.


మిరియాల సుధాకర్ రచించిన “మాట” అనే ఈ కవితలో, సృష్టికర్త ఒక మాట ద్వార కవికి ఉన్న అసంపూర్తి ఎలా తొలిగిందో తెలుసుకొండి.

 
మనోహర్ కోవిరి ఫోటో తీశారు

ప్రతి హాయి

కొత్త ఋతువును పరిచయం చేస్తూ

దాగిన మనసుని

ప్రణయంతో ప్రత్యక్షపరుస్తుంది


తరచి చూస్తే ఒకోక్షణం పలుకుతునే

నీ ఊసులు అందిస్తూ సాగిపోతాయి


****


కెరటాలు తీరాన్ని ముద్దాడుతున్నా

నదులు ఇంకక కలసిపోతున్నా

వాటితో మురిసిపోయే

నవ్వులు సరిపోవు


వసంత కోకిల రాగాలు

ముగిసేవి మౌనంతోనే కదా


****


ఉనికి లోతులోనే

తనతో తాను వెలుగుని

ఆస్వాదిస్తూ కాలంకాకుండ

నిలిచిపోయింది


మాట నీ ప్రేమని అనుభవిస్తూనే

పూర్తికాని అగాధాన్ని అలంకరిస్తుంది

 

నావిగేషన్

 

జట్టు

ఈ పుస్తకాన్ని మిరియాల సుధాకర్ రచించారు, హర్ష మోదుకూరి సమీక్షించారు, లక్ష్మి చింతలపాటి సంపాదకత్వం వహించారు, పి సి రావూరి ప్రూఫ్ రీడ్ చేసారు మరియు మనోహర్ కోవిరి ఫోటో తీశారు.

 

ప్రకటన

ఈ కవిత పేపర్‌బ్యాక్ మరియు ఈబుక్ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది.




మీ అభిప్రాయం?

  • అద్బుతం

  • బాగుండి

  • పర్లేదు

  • బాలేదు


46 views0 comments

Related Posts

See All