అతను-ఆమె

Updated: Nov 5

ఇద్దరు మనుషుల మధ్య ఎంత అనుబంధం ఏర్పడినప్పటికీ, దరిచేరనివ్వని దూరం కలచివేస్తుంది. ఆ తీరని కలయికయే ఈ “అతను-ఆమె”.


మిరియాల సుధాకర్ రచించిన “అతను-ఆమె” అనే ఈ కవితలో, ఇరువురి మధ్య బంధాన్ని, వారి వారి వాంఛలను వ్యక్తపరిచిన సందర్భాన్ని వివరించారు.

 
మనోహర్ కోవిరి ఫోటో తీశారు

అవి...

కొన్ని కొనుక్కు తెచ్చుకున్న క్షణాలు

విరబూసే నవ్వుతో కలలు తలపోస్తూ

వెదజల్లిన పరిమళాన్ని

స్వాసిస్తూ పోయింది.


ఇవి...

ఎన్నో నులివెచ్చని మాటలను

మబ్బుల చాటున నిరీక్షిస్తున్న కిరణాలను

ఉరుముల కాంతితో

సరిపెట్టుకుంది.


****


ఆమె...

శాశ్వత కాలానికి

కౌగిట్లో ఒదిగిపోయి

తల వాల్చాలని ఆశిస్తుంటే...


అతను...

ఆమెను, ఆ ఏకాంతాన్ని

సిరులుగా

ధారపోయమంటూ పోయాడు...

 

నావిగేషన్

 

బృందం

ఈ పుస్తకాన్ని మిరియాల సుధాకర్ రచించారు, హర్ష మోదుకూరి సమీక్షించారు, మధూలిక ఆచంట సంపాదకత్వం వహించారు, పి సి రావూరి ప్రూఫ్ రీడ్ చేసారు, మనోహర్ కోవిరి ఫోటో తీశారు మరియు రోజా కోవిరి నటించారు.

 

ప్రకటన

ఈ కవిత పేపర్‌బ్యాక్ మరియు ఈబుక్ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది.
మీ అభిప్రాయం?

  • అద్భుతం

  • బాగుంది

  • పర్లేదు

  • బాలేదు


96 views0 comments

Related Posts

See All