మనసు అభిలాష

Updated: Sep 13

మన మనసులలో ఎన్నో లక్షల ఆలోచనలు పరిగెడితే అందులో వేల ఆలోచనలు దాగి ఉంటాయి. అలా దాగి ఉన్నా ఆలోచనలను వెలికితీస్తే?


మిరియాల సుధాకర్ రచించిన “మనసు అభిలాష” అనే ఈ కవితలో, సుధాకర్ ఆ సమాధానాన్ని తన అనుభవాలతో వ్యక్తపరిచారు.

 
మనోహర్ కోవిరి ఫోటో తీశారు

ఆ పాలపుంతలో ఉన్న చుక్కలులా

ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులలా

నా మదిలో ఉన్న ఆలోచన తరంగాలు లెక్కలేనన్ని...


కొన్ని చుక్కలు ప్రకాశించి నాలో వెలుగును నింపితే

మరికొన్ని మబ్బుల చాటున దాగి ఉండిపోయాయి...


కొన్ని రేణువులు ఒడ్డున ఉండి సులువుగా దొరికితే

మరికొన్ని సముద్రం తనలో దాచుకొంది...


ఓ నా మనసా మబ్బుల మసకను తొలగించు

సముద్ర అగాధ జలములలోనికి వెళ్లు

బయటికి తియ్యు, నీలో వెలుగును ప్రకాశించు...

 

నావిగేషన్

 

జట్టు

ఈ పుస్తకాన్ని మిరియాల సుధాకర్ రచించారు, హర్ష మోదుకూరి సమీక్షించారు, లక్ష్మి చింతలపాటి సంపాదకత్వం వహించారు, పి సి రావూరి ప్రూఫ్ రీడ్ చేసారు మరియు మనోహర్ కోవిరి ఫోటో తీశారు

 

ప్రకటన

ఈ కవిత పేపర్‌బ్యాక్ మరియు ఈబుక్ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది.
మీ అభిప్రాయం?

  • అద్బుతం

  • బాగుండి

  • పర్లేదు

  • బాలేదు


63 views0 comments

Related Posts

See All