విశ్రాంతి
- Writers Pouch

- May 27, 2023
- 1 min read
Updated: Oct 25, 2025
ఆకృతి లేకుండా ప్రతీ అచ్చు
ఈ మట్టిని ఆధారం చేసుకుంటుంది
తెరచాటు పుడమిలో మిళితమైన
పదార్థాల గుట్టు, కళంకం అంటని
పరిశీలించే కంటికి కాక
మరెవరికి తేటపడును...?

పుట్టుక ఎన్నేన్నో పొరలు చాటున
ఎవరికి వారికి
తమతోనే పూర్తి పరిచయం
తెలియక సాగిపోతుంటుంది
హృదయం నిన్ను కన్నప్పుడు
అక్కరకు రాని ప్రతీ రాయి తొలగిపోయి
లోలోపల వెలికితీసి
విలువనిస్తుంది
సుఖాలు, వేదనలు
మరెన్నో భావాల మధ్య
నీనుండి నన్ను వేరుపరచి
అధికారం కోసం ఊగిసలాడుతూ
దాసుని కమ్మంటుంటాయి
ఈ బ్రతుకు కాలంలో కలిసినప్పుడు
విశ్రాంతి వాటికి బదులిస్తుంది
బృందం
ఈ పుస్తకాన్ని మిరియాల సుధాకర్ రాసినది, హర్ష మోదుకూరి సమీక్షించారు, మధూలిక ఆచంట సంపాదకత్వం వహించారు మరియు మనోహర్ కోవిరి ఫోటో తీశారు.
మీ అభిప్రాయం?
అద్భుతం
బాగుంది
పర్లేదు
బాలేదు



Comments