నివసించు
Updated: 6 hours ago
I: అతను-ఆమె
అవి...
కొన్ని కొనుక్కు తెచ్చుకున్న క్షణాలు
విరబూసే నవ్వుతో కలలు తలపోస్తూ

వెదజల్లిన పరిమళాన్ని
స్వాసిస్తూ పోయింది.
ఇవి...
ఎన్నో నులివెచ్చని మాటలను
మబ్బుల చాటున నిరీక్షిస్తున్న కిరణాలను
ఉరుముల కాంతితో
సరిపెట్టుకుంది.
• • •
ఆమె...
శాశ్వత కాలానికి
కౌగిట్లో ఒదిగిపోయి
తల వాల్చాలని ఆశిస్తుంటే...
అతను...
ఆమెను, ఆ ఏకాంతాన్ని
సిరులుగా
ధారపోయమంటూ పోయాడు...
II: చెలిమి
వీచే గాలి స్పర్శతో మన ముచ్చట్లు
ఓకే చెట్టు కొమ్మకు ఉంటూ
చేరువ కాలేని సహవాసం

రోజూ చూసే కెరటాలే
అవే సాయంకాలపు గుర్తులు
తీరాన పడిన అడుగుల ముద్రలే మనవి
నువ్వు వెళ్ళిపోతావ్ సరే
మరి జ్ఞాపకాల సంగతి ఏంటి..?
మరణం కాలేని వాటికి
ఏ లేపనము పూయలేవు
III: దూరం
తీర్చలేని లోటు అని తెలుసు
తీరని వేదన నీకే కాదు
నువ్వే నేను అనుకున్న నాకు కూడా..

శరీరానికి తగిలిన గాయాలే
మనసుకి మాత్రం నువ్వు పొందిన అవే
కలతలు నా లోతులో చూసినా కూడా..
ముసిరిన కన్నీళ్ళతో చూడలేకున్నాను
తెలియని తప్పు అని సరిపెట్టుకోలేను..
కానీ, మన ఇన్ని రోజుల సహవాసం
నీలో నమ్మకం కలిగించక
ఓడిన ప్రేమ ఎలా సంపాదించుకోవాలి..?
అపార్థంగా ఆలోచించే మనుషుల వల్ల
జరిగేది తప్పు కాదు
హత్యనే అవుతుంది..
నీకుగా ఉన్న సంతోషం
నా దూరంలో ఉన్నపుడు
ఆ బరువును మోస్తూ
నక్షత్రాలు దాటి వెళ్ళిపోతాను
బృందం
ఈ సేకరణ సుధాకర్ మిర్యాల రాశారు, హర్ష మోదుకూరి సమీక్షించారు, మధూలిక ఆచంట సంపాదకత్వం వహించారు మరియు మనోహర్ కోవిరి ఫోటో తీశారు.
మీ అభిప్రాయం?
అద్భుతం
బాగుంది
పర్లేదు
బాలేదు




Comments